జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలోకి మారి ‘వాల్తేరు వీరయ్య’గా ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. రీఎంట్రీ తర్వాత చిరుని సరైన మాస్ రోల్ లో చూడలేదు, వింటేజ్ చిరు కనిపించట్లేదు అనుకునే వారికి ఫుల్ మీల్స్ పెట్టే రేంజులో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తెరకెక్కింది. దర్శకుడు బాబీ స్వతహాగా మెగా ఫ్యాన్ అవ్వడంతో… మెగా అభిమానులకి సాలిడ్ గిఫ్ట్ అవ్వడానికే సినిమా తీసాను అన్నట్లు రెండున్నర గంటల పాటు ఫ్యాన్ మూమెంట్స్ ని లోడ్ చేసి…