ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ రోజుకో మలుపులు తిరుగుతోంది. నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర గోడ కూల్చివేత ఘటనలో హైడ్రామా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి పూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెపుతారు? అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయ్యన్నది కబ్జా కాదు.. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం చేసింది కబ్జా. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల దళితుల…