నడక (వాకింగ్).. ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయాన్నే లేచి చేసే ఓ వ్యాయామం. వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారు.. గుండె ఆరోగ్యం ఉంటుంది. అంతేకాకుండా.. మానసిక ఆరోగ్యం, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అందుకోసమని ఉదయాన్నే ఓ గంటసేపు వాకింగ్ చేయడం చాలా మంచిది. అయితే కొందరు వాకింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు.
అధిక బరువు, ఊబకాయం సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. శరీర బరువును తగ్గించుకునేందుకు నానా ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు వ్యాయామం చేస్తారు. మరికొందరు ఆహారపు అలవాట్లను మార్చుకుంటుంటారు. జిమ్ ల్లో చేరి చెమటోడ్చుతుంటారు. ఉదయం, సాయంత్రం వేళ నడుస్తుంటారు. అయితే ఇన్ని చేసినా కూడా బరువు తగ్గలేకపోతున్నామని నిరాశకు గురవుతుంటారు. ప్లాన్ ఎక్కడ మిస్ అవుతుందబ్బా అంటూ ఆలోచిస్తుంటారు. మరి మీరు రోజు వాకింగ్ చేస్తున్నా కూడా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నారేమో…