అమెరికా వెళ్లి చదువుకోవాలని భావిస్తున్న విద్యార్థులకు శుభవార్త అందింది. విద్యార్థి వీసా స్లాట్ల సంఖ్యను అమెరికా భారీగా పెంచింది. దీంతో పాటు వెయిటింగ్ సమయాన్ని కూడా భారీగా తగ్గించింది. ఇటీవల ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అమెరికా వీసా స్లాట్ల కోసం సుమారు మూడేళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కాన్సులేట్ కార్యాలయం పరిధి నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వెయిటింగ్ సమయాన్ని అమెరికా…