న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య నవంబర్ 8 నుంచి 15 వరకు 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్ కోసం ఇటీవలే బీసీసీఐ జట్టును ప్రకటించింది. భారత జట్టు కోచింగ్ బాధ్యతలను భారత మాజీ క్రికెటర్, ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ అందుకోనున్నాడని తెలిసింది. లక్ష్మణ్ గతంలో కూడా తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.…