తెలుగు చిత్రసీమలోని ఇప్పుడున్న ఎంతోమంది సినిమాటోగ్రాఫర్స్ కు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ గురువుగా నిలిచారు వి.ఎస్.ఆర్.స్వామి. ఆయన కెమెరా పనితనంతో రూపొందిన అనేక చిత్రాలు జనానికి కనువిందు చేశాయి. తెలుగు చిత్రసీమలో తొలి సినిమాస్కోప్-ఈస్ట్ మన్ కలర్ చిత్రంగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’కు ఆయనే సినిమాటోగ్రాఫర్. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే తన కెమెరా పనితనంతో జనాన్ని ఆకట్టుకున్నారు స్వామి. నలుపు-తెలుపు చిత్రాలలో సందర్భానుసారంగా ‘సిల్హౌట్స్’ను ఉపయోగించి మెప్పించారు. రంగుల చిత్రాలలోనూ సందర్భానికి తగిన యాంగిల్స్ తో రంజింపచేశారు.…