Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్ తీవ్రం అవుతోంది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ పట్టణం బఖ్‌ముత్ లక్ష్యంగా ముందుకు కదులుతోంది. ఈ పట్టణం రష్యా వశం అయితే ఉక్రెయిన్ యుద్ధంపై పట్టుకోల్పోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా సైన్యం ఎట్టి పరిస్థితుల్లో అయినా బఖ్‌ముత్ ను స్వాధీనం చేసుకుంటుందని ఆ దేశం పట్టుదలతో ఉంది.
యుద్ధం ప్రారంభమై కొన్ని నెలలైనా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని స్థలాలు, సముదాయాల లక్ష్యంగా అటాక్ చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్ విద్యుత్ సముదాయాలే లక్ష్యంగా రష్యా దాడికి తెగబడింది.
Ukraine in the dark. Russian attack on power system: రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు చేస్తోంది. ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా అక్కడి విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. తాజాగా రష్యా దాడుల ఫలితంగా ఉక్రెయిన్ లో అంధకారం నెలకొంది. దేశంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో కోటి మంది ఉక్రెయిన్లకు విద్యుత్ లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ గురువారం అన్నారు. ఒడెస్సా, విన్నిట్సియా, సుమీ, కీవ్ ప్రాంతాలు…
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దురాక్రమణ పరాకాష్టకు చేరుతోంది. పుతిన్ అరాచకానికి సైనికులతో పాటు సామాన్య పౌరులు బలైపోతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హతమార్చేందుకు రెక్కీల మీద రెక్కీలు సాగుతున్నాయనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. సైనిక చర్య మొదలైన వారం రోజుల్లోనే ఆయన హత్యకు మూడుసార్లు యత్నించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతోన్న భద్రతా దళాలు రష్యా కుట్రను భగ్నం చేస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిని కడతేర్చేందుకు వందలాది మంది ప్రైవేటు సైన్యం కీవ్‌లో ప్రవేశించిందని వారం…