Volcano erupts again in Iceland: ఐస్‌లాండ్‌లో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. శనివారం బద్దలైన అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగిసిపడ్డాయి. భూమిలోని పగుళ్ల నుండి రాతితో పాటు లావా బయటకు చిమ్మింది. ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్‌జావిక్‌కు దక్షిణంగా ఉన్న రేక్‌జానెస్ ద్వీపకల్పంలో ఈ విస్ఫోటనం సంభవించింది. అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగోసారి. రేక్‌జానెస్‌లో విస్ఫోటనం ప్రారంభమైందని ఐస్‌లాండిక్ వాతావరణ కార్యాలయం తన వెబ్‌సైట్‌లో…
అగ్ని పర్వతాలు రెండు రకాలు ఉంటాయి. కొన్ని నాన్ యాక్టీవ్‌గా ఉంటే కొన్ని యాక్టీవ్‌గా ఉంటాయి. యాక్టీవ్‌గా ఉండే అగ్నిపర్వతాలు నిత్యం వేడిని వెదజల్లుతుంటాయి. అవి ఎప్పుడు బద్దలవుతాయో చెప్పలేం. ఆ పర్వతాల వద్దకు వెళ్లాలి అంటే ధైర్యం ఉండాలి. అలాంటిది ఆ పర్వతంపై రెస్టారెంట్ ఓపెన్ చేసి, అగ్నిపర్వతం నుంచి వెలువడే వేడితోనే వంట చేస్తే ఇంకెలా ఉంటుంది. కష్టమర్ల సంగతి పక్కనపెడితే అందులో పనిచేసేవారికి గుండెధైర్యం మెండుగా ఉండాలి. ఇలాంటి రెస్టారెంట్ ఒకటి స్పెయిన్‌లోని…
ఇటీవలే పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా దీవుల్లోని అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం బద్దలైన దృశ్యాలను నాసా శాటిలైట్ ద్వారా చిత్రీకరించింది. టోంగా దీవుల్లో బద్దలైన ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడిన శక్తి హిరోషిమా అణుబాంబు శక్తి కంటే 200 రెట్లు అధికంగా ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అగ్నిపర్వతం బద్దలైనపుడు వెలువడిన బూడిద సుమారు 40 కిలో మీటర్ల మేర వ్యాపించిందని, పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, కాలువలు, చెరువులు, నదులు బూడిదతో నిండిపోయిందని నాసా తెలియజేసింది.…