Japan Volcano Eruption: జపాన్‌లో అగ్నిపర్వతం పేలింది. పశ్చిమ జపాన్ ద్వీపం క్యుషులోని సకురాజిమా అగ్నిపర్వతం వద్ద ఆదివారం తెల్లవారుజామున అనేక భారీ పేలుళ్లు సంభవించాయి. వాతావరణ సంస్థ (JMA) ప్రకారం.. మొదటి పేలుడు తెల్లవారుజామున 1 గంటలకు సంభవించింది. ఆ తరువాత ఉదయం 2:30, ఉదయం 8:50 గంటలకు మరో రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ మూడు పేలుళ్లు చాలా శక్తివంతమైనవని, వీటి కారణంగా లావా, బూడిద ఆకాశంలో 4.4 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసాయని వెల్లడించింది.…