టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ కన్ఫర్మ్ అయింది. ‘మాస్ మహారాజా’ రవితేజ నటించనున్న హారర్ చిత్రంలో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాంతో రవితేజ కొత్త సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సినిమాకు వివేక్ అత్రేయ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కథ, స్క్రీన్‌ప్లే పరంగా ప్రత్యేకమైన మార్క్ ఉన్న వివేక్…