Kaliyuga Pattanam Lo: విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం కలియుగం పట్టణంలో. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు.
'అల్లంత దూరాన, ఐ.పి.ఎల్.' చిత్రాలలో నటించిన విశ్వ కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా 'ఎన్త్ అవర్'. రాజు గుడిగుంట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.
బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన విశ్వ కార్తికేయ ఇప్పుడు మూడు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో 'అల్లంత దూరాన' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది!
విశ్వ కార్తికేయ హీరోగా, సీనియర్ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ హీరోయిన్ గా చలపతి పువ్వల దర్శకత్వంలో ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్న చిత్రం ‘అల్లంత దూరాన’. ఈ చిత్ర నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రసాద్ ల్యాబ్ లో మూవీ టీజర్ ను హాస్యనటుడు అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ, ”కధకు తగ్గట్టుగా ఆర్టిస్టులను ఎంపిక…