‘పాగల్’… హీరో విశ్వక్ సేన్ చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. వాటిలో హిట్స్ అంటే ఒక్క ‘హిట్’ మాత్రమే. అదీ ఓ మాదిరి హిట్. అంతకు ముందు చేసిన వాటిలో ‘ఫలక్ నుమా దాస్’ సో..సో. అయితే ఇతగాడి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఇటీవల అతను పాల్గొన్న వేడుకల్లో స్పీచెస్ వింటే అది ఇట్టే అర్థం అవుతుంది. అప్పుడే తానో సూపర్ స్టార్ అయినట్లు ఫీలవుతుంటాడు. విజయ్ దేవరకొండ స్థాయిలో ఇమేజ్ వచ్చినట్లు బిల్డప్ ఇస్తుంటాడు.…