కేరళలో సంచలనం సృష్టించిన విష్ణుజా(25) మృతి కేసులో విస్మయం కలిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త, అతని కుటుంబ సభ్యులు పెట్టిన హింస భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
Kerala: కేరళకు చెందిన మహిళ విష్ణుజ మరణం సంచలనంగా మారింది. భర్త, అత్తింటి వారి అవమానాలు, హింసను ఎదుర్కొన్న మహిళ మరణించింది. గత వారం కేరళలోని మలప్పురం లోని తన ఇంట్లో 25 ఏళ్ల విష్ణుజ మరణించి కనిపించింది. ఈ కేసులో భర్త, వారి బంధువులు ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా సంబంధించి సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.