భారతీయ సినిమా రంగంలో పాన్-ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేసిన హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి సరికొత్త యానిమేటెడ్ ఫ్రాంచైజీ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ (MCU)ని ప్రారంభించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి చిత్రం ‘మహావతార్ నరసింహ’ 2025 జూలై 25న ఐదు భారతీయ భాషలలో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) అత్యాధునిక 3D ఫార్మాట్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల…
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 'కేజీయఫ్', 'సలార్' వంటి భారీ యాక్షన్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న మొట్టమొదటి యానిమేషన్ చిత్రం 'మహావతార్ నరసింహ'. అశ్విన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 25న 3డీ ఫార్మాట్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.