Home
Visakhapatnam News
Visakhapatnam News News
-
AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
AP and TG Crime: హైదరాబాద్ ఐటీ కారిడార్ మాదాపూర్‌లోని ఓయో హోటల్లో యువతి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో అనుమానితుడిగా ఉన్న యువకుడు ఆసుపత్రి నుంచి పరారై తన స్వగ్రామానికి చేరుకున్న అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ పరిణామంతో మాదాపూర్ పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. విశాఖపట్నానికి చెందిన షారోన్ నిఖితా టోప్నో, అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఇ-మర్రిపాలెంకు చెందిన… -
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన సభా ప్రాంగణానికి చేరుకోగానే లబ్ధిదారులు, సభికులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ తమ స్థానాల్లో నిలబడి చేతులు ఊపుతూ ఘన స్వాగతం పలికారు. ప్రజల ఉత్సాహానికి ప్రతిగా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ మీద నడుస్తూ అందరికీ అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మంత్రి నాదెండ్ల… -
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
CM Chandrababu: 40 ఏళ్లుగా తమ ఇళ్లపై పూర్తి హక్కుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద, మధ్య తరగతి కుటుంబాల కల సాకారం కానుంది. విశాఖపట్నం వేదికగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్న 28,445 కుటుంబాలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హక్కుదారు పట్టాలను పంపిణీ చేయనున్నారు. దీని విలువ రూ.8,874 కోట్లు. మొత్తం 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరిస్తూ 19,33,853 చదరపు గజాలను పేద కుటుంబాలకు… -
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
CM Chandrababu: విశాఖలోని పేదలకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దశాబ్దాలుగా సొంత ఇంటిపై హక్కు కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాల కలను సాకారం చేసేందుకు రేపు విశాఖపట్నం వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు, హక్కు పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు పూర్తి హక్కులు కల్పించేలా ఈ… -
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
Vizag Tragedy: రాఖీ పండుగ రోజున విశాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ తన భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతుడిని మల్ల ప్రవీణ్ కుమార్‌గా గుర్తించారు. ఆయన స్వస్థలం కొత్తవలస కాగా, జీవనోపాధి కోసం పెందుర్తిలోని ఓ అద్దె ఇంట్లో భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రవీణ్ కుమార్ ఆటో… -
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
Minister Narayana: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాతావరణం వచ్చినట్టే కనిపిస్తోంది.. ఎన్నికల ప్రక్రియకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. మరోవైపు.. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ.. స్థానిక సంస్థల్లో వాటిని అమలు చేసేలా కూడా నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, ఈ సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోర్టు తీర్పుపై ఆధారపడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలపై కోర్టు… -
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
Vizag School Tragedy: విశాఖపట్నంలో దారుణం వెలుగు చూసింది.. విశాఖ నగరంలోని వన్‌టౌన్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ టీచర్ కొట్టడంతో ఆరేళ్ల విద్యార్థి మృతి చెందినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. లిటిల్ గార్డెన్స్ స్కూల్లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతుడిని ప్రణయ తేజగా గుర్తించారు. అతడు యూకేజీ విద్యార్థిగా కుటుంబ సభ్యులు తెలిపారు. టీచర్ దెబ్బలకు బాలుడు తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాలుడిని కేజీహెచ్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే… -
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆగస్టు 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలపరచడం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను నిర్ణయించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఆగస్టు 17న సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయనకు విశాఖపట్నంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. ఆగస్టు 18న ఉదయం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని… -
Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
Floodlight Collapse: విశాఖపట్నంలో వీచిన ఈదురుగాలులకు రైల్వే స్టేడియంలోని భారీ ఫ్లడ్ లైట్ కుప్పకూలింది. ఈ ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ స్టేడియంలో వందలాది మంది వాకింగ్, జాగింగ్ కోసం వస్తుంటారు. అయితే ఫ్లడ్ లైట్ కూలిన సమయంలో వర్షం, ఈదురుగాలుల కారణంగా మైదానం ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కొద్దిసేపు వీచిన బలమైన గాలులకే ఫ్లడ్ లైట్ విరిగి పడటంతో… -
Kolusu Parthasarathy: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కౌంట్‌డౌన్.. ఉత్తరాంధ్రపై పార్థసారథి కీలక వ్యాఖ్యలు
Kolusu Parthasarathy: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుండటం ప్రాంత అభివృద్ధికి కీలక మలుపు అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తిరుపతి నుంచి ఇచ్చాపురం వరకు, మధ్యలో అమరావతి సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు…
తాజావార్తలు
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
-
Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!