‘పరుగుల రారాజు’ విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు అలవోకగా సెంచరీలు బాదిన విరాట్.. ఇప్పుడు క్రీజులో నిలబడడానికే నానా తంటాలు పడుతున్నాడు. ఎప్పుడో ఓసారి మెరుపులు తప్పితే.. మునుపటి కోహ్లీ మనకు కనబడుట లేదు. గతంలో అన్ని ఫార్మాట్లలోనూ నంబర్‌వన్ ర్యాంకు అందుకున్న కింగ్.. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో కిందికి పడిపోతున్నాడు. ఎంతలా అంటే టాప్-20 నుంచి కూడా ఔట్ అయ్యాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ…