Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థిని వినాయక చవితి అని కూడా అంటారు. భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి రోజు వినాయకుడు జన్మించాడని చెబుతారు. అందుకే ఏటా ఇదే రోజున వినాయక చవితి జరుపుకుంటారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ 27 ఆగష్టున వచ్చింది. అంటే రేపే వినాయక చవితి. వినాయక చవితి వేడుకలు పది రోజుల పాటు జరుపుకుంటారు.