రవితేజ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమార్కుడు’ సినిమా రవితేజ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. పోలీస్ పవర్ ను చాటిన సినిమాలలో ‘విక్రమార్కుడు’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. రవితేజను ద్విపాత్రాభినయంలో అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. 2006 వచ్చిన ఈ సినిమాలో అనుష్క శెట్టి కథానాయిక. దీనిని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ‘రౌడీ రాథోడ్’ పేరుతో రీమేక్ చేయగా అక్కడా జయకేతనం ఎగురువేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు వినిపిస్తోంది. హీరోగా రవితేజ…