ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన తమిళస్టార్ హీరో విజయ్ మాస్టర్ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ బరిలో మాత్రం ఆ మూవీ విజయకేతనం ఎగరేసింది. ఆ తర్వాత విజయ్ ఏ సినిమాలో చేస్తాడనే దానిపై వచ్చిన రకరకాల సందేహాలకు తెర దించుతూ, ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో విజయ్ మూవీ చేయబోతున్నాడని అధికారిక వార్త వచ్చింది. విజయ్ 65వ చిత్రమైన దీనిలో అతనితో పూజా హెగ్డే స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. విశేషం…