తమిళ నటుడు డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం బాధాకరం.. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్ అని పేర్కొన్నారు.
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు కోలీవుడ్ వెటరన్ స్టార్ హీరో విజయకాంత్. ది కెప్టెన్ అంటూ అభిమానులు పిలుచుకునే విజయకాంత్ కి 80-90ల్లో సూపర్ స్టార్ స్థాయి ఇమేజ్ ఉండేది. యాక్షన్ సినిమాలని ఎక్కువగా చేసే విజయకాంత్ రాజకీయాల్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలు, రాజకీయాలని బాలన్స్ చేసుకుంటూ తన అభిమానులకి ఎప్పుడూ దగ్గరగానే ఉన్న వియజయకాంత్ అనారోగ్య సమస్యల కారణంగా గతకొంతకాలంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి…