తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఏపీ పర్యటనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. ‘మనిషివా చంద్రబాబు’ అనే పరిస్థితి తెచ్చుకున్నాడంటూ చంద్రబాబు కు చురకలు అంటించారు విజయసాయిరెడ్డి. ”గాల్లో కలిసిపోతారని సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వక్రబుద్ధి ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదు. వరద ప్రాంతాల పర్యటనలో తన భార్య గురించి మాట్లాడి ‘మనిషివా చంద్రబాబు’ అనే పరిస్థితి తెచ్చుకున్నాడు. తానే బాధల్లో ఉన్నానని,…
విశాఖ:- 2024 నాటికి టీడీపీ పార్టీ ఖాళీ అవుతుందని… ఆ పార్టీ అంతర్ధానం అయిపోతుందని వైసీపీ ఎండీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నాయకులు మాతో టచ్ లో వున్నారు..చర్చలు జరుగుతున్నాయన్నారు. పనితీరు ఆధారంగా అందరికీ సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీ నుంచి విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో ముఖ్య నాయకులు చేరారు. గతంలో టిక్కెట్లు ఆశించి పార్టీ నుంచి బయటకు వెళ్లిన నాయకులను తిరిగి అహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..…
గ్రేటర్ విశాఖపట్నం మున్సిప్ కార్పోరేషన్ పరిధిలో 31వ వార్డు కార్పొరేటర్ పదవికి ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యం అధికార వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే వానపల్లి రవికుమార్ సతీమణి గాయత్రిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే పోటీ చేయకూడదని వైసీపీ నిర్ణయం. అనితర ప్రజా సేవ చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే పోటీ చేయకూడదన్న రాజకీయ విలువలకు పార్టీ…
చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నల్గొండ ఎస్పీ రంగనాథ్ స్పందించారు. ఆయన ఆరోపణలు నిరాధారం అన్నారు. పోలీసులకు దురుద్దేశాలు ఆపాదించవద్దన్నారు. ఏవోబీలో గంజాయి సాగు అందరికీ తెలిసిందేనని, పక్కా సమాచారం మేరకే ఏవోబీలో దాడులు చేసినట్టు ఎస్పీ తెలిపారు. నల్గొండలో భారీగా గంజాయి పట్టుబడిందని గంజాయి నివారణకు అందరూ కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ రంగనాథ్ అన్నారు. పోలీసులకు రాజకీయాలతో ముడి పెట్టవద్దన్నారు.
రోజురోజుకు ఏపీలో టీడీపీ, వైసీపీ నేల మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలతో ఏపీలో నిరసన జ్వాలలు చెలరేగాయి. అంతేకాకుండా గత పది రోజుల నుంచి వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. చంద్రబాబు టెర్రరిస్టు అంటూ ఇటీవల విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కౌంటర్ ఇచ్చారు.…
అప్పన్న దేవాలయానికి సంబంధించిన భూముల అవకతవకల్లో ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు పాత్ర ఉందేమో అన్న అనుమానం కలుగుతోందని…అసలు ఆయన ధర్మకర్త..లేక అధర్మ కర్తా అని ఫైర్ అయ్యారు విజయ సాయి రెడ్డి. సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆయన భూములు, దేవాలయంలో ఆస్థులలో అవకతవకలకు పాల్పడకపోతే కోర్టు కు వెళ్లి మళ్ళీ పదవి తెచ్చుకోవడం చూస్తుంటే అదే అనుమానం కలుగుతోందని ఎద్దేవా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు ఈరోజు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద ఆయన ఈ నోటీసును ఇచ్చారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. read also : తెలంగాణ…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాయలసీమకే కాదు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేశాడని ఫైర్ అయ్యారు. “సీమకే కాదు ఉమ్మడి ఏపీకి అన్యాయం చేసింది చంద్రబాబే. నీటి కేటాయింపులు లేకుండా కర్నాటక ఆల్మట్టి డ్యాం నిర్మిస్తుంటే అప్పటి ప్రధాని దేవెగౌడకు ఆగ్రహం కలుగుతుందని నోరు మూసుకున్నది ఎవరు? 14 ఏళ్లు…
తెలంగాణ పీసీసీగా రేవంత్ రెడ్డి ఎంపిక కావడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన స్టైల్‌లో స్పందించారు. రాహుల్ గాంధీని ‘ఇంప్రెస్’ చేయడానికి ఏం ‘మంత్రం’ వేశాడో గాని టీపీసీసీ అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎంపిక చేయకుండా అడ్డుకున్నాడని… అన్ని అడ్డంకులు క్లియర్ చేసి తన మనిషిని పీసీసీ సీట్లో కూర్చోబెట్టాడని చంద్రబాబు చురకలు అంటించారు. టీపీసీసీని… ఇక తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీ(TBCC) అనాలేమో అని ఎద్దేవా చేశారు. కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు…