ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే.. అధికార పార్టీ నేతలో.. ప్రతిపక్ష నేతలో.. ఈ విషయంపై తరచూ స్పందిస్తూ ఉంటారు.. విశాఖ నుంచి పాలన కొనసాగించాలని అధికార వైసీపీ వేగంగా ప్రయత్నాలు చేసినా.. కొన్ని అనివార్య కారణాలతో అది వాయిదా పడింది.. ఇక, ఈ మధ్య మళ్లీ తరచూ విశాఖ రాజధానిపై మాట్లాడుతూనే అధికార వైసీపీ నేతలు.. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం టిడిపికి ఎందుకు పట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. “రెండేళ్లలో జగన్ గారు ఏం చేయక పోతే 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పచ్చపార్టీ అడ్రసు లేకుండా ఎందుకు పోతుంది? పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం ఎందుకు పట్టుకుంటుంది. వచ్చే మూడేళ్లలో యువ సిఎం నాయకత్వంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయి.”…
ఇవాళ టిడిపి మహానాడు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహానాడు కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతారు..? అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. “ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది. టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైంది. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతావ్ బాబూ? కుప్పంలో ఎందుకు ఖంగుతిన్నావో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో…
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు సిఎంగా ఉండి చంద్రబాబు పొడిచింది ఏముంది? అని మండిపడ్డారు. “ఈ ‘వారం రోజుల సిఎం కుర్చీ’ పగటి కల ఏంటి చంద్రబాబు? జనం నవ్వుకుంటారన్న ఇంగితం కూడా లేదు. 14 ఏళ్లు సిఎంగా ఉండి పొడిచింది ఏముంది? ఏ స్కీమ్ వల్లనైనా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలవా? ప్రజలను దోచుకున్నందుకేగా నీకు సున్నం…
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ విజయసాయిరెడ్డి మరోసారి చురకలు అంటించారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో లాగే అభ్యర్థులు కూడా దొరకరని.. ఈ విషయం రాసి పెట్టుకోవాలని చంద్రబాబుకు గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. “:ఆశలన్నీ చెల్లాచెదురైన తర్వాత తండ్రీ కొడుకుల భాష మారడంలో వింతేమి లేదు. పార్టీ లేదు బొక్కా లేదు అని స్వయంగా పార్టీ అధ్యక్షుడే అన్నాక వీళ్ల సంస్కారహీన వీరంగాలు ఇలాగే ఉంటాయి. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో లాగే అభ్యర్థులు కూడా దొరకరు.…
విశాఖలో కరోనా బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్స్, వైరాలజీ ల్యాబ్, కేజీహెచ్ హాస్పిటల్‌ను వెస్‌ఆర్‌సీపీ ఎం.పి విజయసాయిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విశాఖలోని KGH హాస్పిటల్‌లో కరోనా బాధితులకు అందుతున్న సేవలను స్వయంగా తెలుసుకునేందుకు కరోనా వార్డులోకి వెళ్లారు. డాక్టర్లు వారించినా పి.పి.ఈ కిట్ ధరించి నేరుగా కరోనా రోగుల వద్దకు వెళ్లారు. ఒక్కొక్క బెడ్ వద్దకెళ్లి చికిత్స పొందుతున్న పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లేనిపోని అనుమానాలు, భయాలు…
టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. దేశ ప్రజలు మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంటే.. చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం స్మగ్లర్ల ద్వారా విదేశాల నుంచి టీకాలు తెప్పించుకుని వేయించుకున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. “దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కాకముందే స్మగ్లర్ల ద్వారా విదేశాల నుంచి టీకాలు తెప్పించుకుని తండ్రి కొడుకులు వేయించుకున్నారని అందరూ అనుకుంటున్నారు. ఎల్లో మీడియా ఫ్రంట్ పేజీల్లో ఫోటోలు కనిపించక…
టిడిపి పార్టీ పై విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. కుల పిచ్చతో చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని కోల్పోయాడని విజయసాయిరెడ్డి. “కుల పిచ్చితో అడ్డమైన అరాచకాలు చేసి చంద్రబాబు తన రాజకీయ పతనాన్ని తానే కొనితెచ్చుకున్నాడు. మతం పేరుతో విభజన తీసుకురావాలని ఆరాటపడుతున్న వాళ్ల గతీ అంతే. పోలింగుకు రెండ్రోజుల ముందు దాకా గురుమూర్తి మతం ఏమిటో తెలియదా మీకు? మీకంటే నిఖార్సైన హిందువు ఆయన. ” అంటూ తెలిపారు విజయసాయిరెడ్డి. ఇక అంతకు ముందు ట్వీట్…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు భంగపాటు తప్పదని పేర్కొన్నారు. “వైజాగ్ స్టీల్ పై ప్రధానికి రాసిన లేఖతో, తను గోబెల్స్ ప్రచారాలకు పాల్పడ్డట్టు చంద్రబాబు అంగీకరించాడు. జగన్ గారి ప్రభుత్వం ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అమ్మాలని చూస్తోందని మొన్నటి దాకా దుష్ప్రచారం చేసాడు. కేంద్ర బడ్జెట్ లో ప్రైవేటీకరణను ప్రతిపాదించారని లేఖలో ప్రస్తావించాడు. గుండె దిటవు చేసుకో చంద్రబాబూ. జరగబోయే…