ప్రస్తుతం కెరీర్ పరంగా లోలో ఉన్న టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ‘ఊరమాస్’ విధ్వంసం సృష్టించడానికి సిద్ధమయ్యారు. దిల్ రాజు నిర్మాణంలో, ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ఒక భారీ ప్రాజెక్టుకు ‘రౌడీ జనార్ధన’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా సాగిన…