చిత్ర పరిశ్రమలో కొందరి హీరోయిన్లకు సినిమా ఫలితాలతో సంబంధం ఉండదు. ఎన్ని ఫ్లాపులు పలకరించినా వారి ట్యాలెంట్ ముందు ఆఫర్లు క్యూ కడుతుంటాయి. సరిగ్గా ఇదే కోవలోకి వస్తారు జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్. కొంతకాలంగా సరైన హిట్ లేకపోయినా, తాజాగా టాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్‌ను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తి సురేష్, ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవితో…
విజయ్ దేవరకొండ కెరీర్‌లో తెరకెక్కుతున్న అత్యంత కీలకమైన చిత్రం ‘కింగ్‌డమ్’. గతంలో లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి ఫ్లాప్స్ కారణంగా.. విజయ్ మార్కెట్ మీద చాలా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ‘కింగ్‌డమ్’ ద్వారా తన కెరీర్‌ను మళ్లీ పైకి తీసుకెళ్లాలన్న నమ్మకంతో విజయ్ అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి జెర్సీ వంటి హిట్‌ను అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తీసుకున్నారు. విజయ్ దేవరకొండ…