Kingdom : కింగ్డమ్ సినిమా రిలీజ్ డేట్ లాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ కెరీర్లో తెరకెక్కుతున్న అత్యంత కీలకమైన చిత్రం ‘కింగ్డమ్’. గతంలో లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి ఫ్లాప్స్ కారణంగా.. విజయ్ మార్కెట్ మీద చాలా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ‘కింగ్డమ్’ ద్వారా తన కెరీర్‌ను మళ్లీ పైకి తీసుకెళ్లాలన్న నమ్మకంతో విజయ్ అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి జెర్సీ వంటి హిట్‌ను అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తీసుకున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఇది అత్యధిక బడ్జెట్ కలిగిన పాన్ ఇండియా చిత్రం.
Also Read : Ye Maaya Chesave : ‘ఏ మాయ చేసావే’ ప్రమోషన్లో నేను లేను.. సమంత క్లారిటీ
Also Read
- The Traitors Telugu :'చీప్.. మిడిల్ క్లాస్'.. వర్ష'పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
- Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
- Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజయ్ లుక్ అన్నీ కలిసి సినిమాపై పాజిటివ్ బజ్ తెచ్చాయి. అయితే, టీజర్ తర్వాత ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ విడుదల కాలేదు. పాటలు, ట్రైలర్ లేదా మీడియా ఈవెంట్లపై ఎటువంటి అప్డేట్లు లేకపోవడం కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం, ‘కింగ్డమ్’ సినిమా 2025 జూలై 25న, శుక్రవారం విడుదల కానుందని ఓ వార్త వైరల్ అవుతుంది. అధికారికంగా ఈ విషయంపై మేకర్స్ ప్రకటించనప్పటికీ, ఆ డేట్‌కే సినిమాను ప్లాన్ చేశారని ఇండస్ట్రీ లోగాసిప్. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలున్నాయి.
సాధారణంగా ఇలాంటి భారీ చిత్రాలు విడుదలకు రెండు నెలల ముందే సాంగ్స్, ఈవెంట్లు మొదలవుతాయి. కానీ ‘కింగ్డమ్’ మేకర్స్ ఇప్పటికీ ప్రమోషనల్ కార్యక్రమాలపై మౌనమే పాటిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నారు. తన కెరీర్‌ను మళ్లీ నిలబెట్టుకోవాలనుకునే విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఎంతో ముఖ్యం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Road Accident: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..
-
Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
India’s Playing XI: కివీస్‌తో తొలి పోరు.. టీమిండియా తుది జట్టులో వైభవ్‌కు ఛాన్స్..?
-
Macron vs Trump: ‘అవి తెలివి తక్కువ వ్యాఖ్యలు’.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన మాక్రాన్
-
AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!