నటుడు విజయ్ చందర్ పేరు వినగానే చప్పున ఈ నాటికీ ‘కరుణామయుడు’ విజయ్ చందర్ అంటూ జనం గుర్తు చేసుకుంటారు. ఏసుప్రభువు జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘కరుణామయుడు’ చిత్రాన్ని నిర్మించి, ఏసు పాత్రలో నటించి, అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు విజయ్ చందర్. అప్పటి నుంచీ జనం మదిలో ఆయన ‘కరుణామయుడు’ విజయ్ చందర్ గానే నిలచిపోయారు. తెలుగునాట యన్టీఆర్ తరువాత పురాణ,చారిత్రక పాత్రల్లో మేటి అనిపించుకున్న ఘనుడు విజయ్ చందర్. తెలుగుతెరపై ఏసుక్రీస్తు జీవితాన్ని తొలిసారి…