Viral Video: ఇటీవల కాలంలో యువత గుండెపోటుతో హఠాత్తుగా మరణిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు చేస్తూ కుప్పకూలిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లోని విదిషలో జరిగింది. పెళ్లి వేడుకల్లో డ్యాన్సు చేస్తూ, 23 ఏళ్ల యువతి ఉన్నట్టుండి కుప్పకూలింది. స్టేజ్ పైనే పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని బుధని నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విదిషా నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా విజయం సాధించారు.
Shivraj Singh Chouhan: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే 100 మందితో తొలి జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్ కొలిక్కి రాకపోవడంతో, వారిపై మరింత ఒత్తిడి పెంచేందుకు బీజేపీ పక్కాగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ని బీజేపీ లోక్‌సభ బరిలో నిలుపనున్నట్లు తెలుస్తోంది.
Boy Fell In Borewell: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బోరు బావిలో పడిన పిల్లాడి ఘటనలో విషాదం చోటు చేసుకుంది. ఏడేళ్ల పిల్లాడిని రక్షించేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. 24 గంటల తర్వాత పిల్లాడిని బయటకు తీసినా అప్పటికే చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివారాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలో ఏడేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. అతడిని బయటకు తీసేందుకు జిల్లా కలెక్టర్ శంకర్ భార్గవ తో పాటు పోలీస్, ఇతర అధికారులు…