ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలోన్ మస్క్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మస్క్ తన వేలికొనపై రెండు స్పూన్లు బ్యాలెన్స్ చేస్తూ చూపించారు. రెండు చెంచాలు కూడా పడకుండా బ్యాలెన్స్ చేస్తూ పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రక్కనే ఉన్నారు.