వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపొందింది. దీంతో వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచింది.
వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. చాలా కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్‌తో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌పై తన జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. 134 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది. 312 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 40.5 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు.. ఆరంభంలోనే ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈరోజు ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాలో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా పాకిస్తాన్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
సెర్బియా యోధుడు.. టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ (Novak Djokovic) కొత్త చరిత్ర లిఖించాడు. మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ లో నోవాక్ జొకోవిచ్ క్యాస్పర్ రూడ్‌ను ఓడించాడు. తద్వారా పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా అవతరించాడు.
444 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఐదో రోజు తొలి సెషన్ లో 63.3 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. చివరి రోజు టీమిండియా గెలువాలంటే 280 పరుగులు కావాలి. అందుకు ఆస్ట్రేలియా గెలువాలంటే 7 వికెట్లు పడగొట్టాలి. బ్యాటింగ్, బౌలింగ్ బలాబలాల్లో గెలుపు ఆసీస్ నే వరించింది. 3 వికెట్ల నష్టానికి 164 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు.