ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరూ ఊహించని పేరును కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణకు చెందిన బి.సుదర్శన్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.
దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఇక నామినేషన్‌కు రెండు రోజులే గడువు ఉంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి తమిళనాడు వ్యక్తి, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది. ఇప్పుడు ఇండియా కూటమి వంతు వచ్చింది. ఇందుకోసం ప్రతిపక్ష కూటమి తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇక నామినేషన్‌కు ఆగస్టు 21వ తేదీ చివరి రోజు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించేశాయి. తమిళనాడు ప్రాంత వాసి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్ పేరును ఎన్డీఏ కూటమి ప్రకటించేసింది. అనూహ్యంగా ఊహాగానాల్లో వినిపించని పేరు తెరపైకి వచ్చి ఆశ్చర్యపరిచింది. అయితే రాధాకృష్ణన్ ఎంపిక వెనుక బీజేపీకి చాలా వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇండియా కూటమి సోమవారం సమావేశం కానుంది. ఢిల్లీలో ఉదయం 10 గంటలకు ప్రతిపక్ష నేతలంతా భేటీకానున్నారు. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు.
Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఎంపిక చేశారు. సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులందరూ కలిసి ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చారు.