స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. స్వాతి మలివాల్ పై దాడి ఘటనలో అరెస్టైన ఆయన తీస్ హజారీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కేసు విచారణ సందర్భంగా స్వాతి మలివాల్ కూడా కోర్టుకు చేరుకున్నారు.
సీఎం హౌస్‌లో రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో నిందితుడు విభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరవింద్ కేజ్రీవాల్ సీఎం హౌస్ నుండి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇప్పుడు విభవ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లనున్నారు.
ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తనపై దాడి చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్‌పై రాత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు విభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) సమన్లు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా స్వీకరించిన మహిళా కమిషన్ మే 17న ఉదయం 11 గంటలకు తన ఎదుట హాజరుకావాలని విభవ్ కు�