చిత్రపరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు రాజేష్ మరణంతో కన్నడ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయనను శాండల్ వుడ్ లో కళా తపస్వి అని కూడా పిలుస్తారు. వయస్సు సంబంధిత సమస్యల కారణంగా 89 ఏళ్ళ వయసులో ఉన్న ఆయన ఆసుపత్రిలో కన్నుమూశారు. రాజేష్ ఫిబ్రవరి 9 నుండి వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా బెంగుళూరులోని ఓ ఆసుపత్రి చేరి చికిత్స పొందుతున్నాడు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్రిటికల్…