తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. జూలై 16 నుంచి ఈనెల 20 వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాల లిస్టు విడుదల చేసింది.
హిమాచల్‌ప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సిమ్లా వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది.
ఈ సీజన్‌లో తొలిసారి హైదరాబాద్‌కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. సిటీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. తెలంగాణలోని 14 జిల్లాల్లో శనివారం అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్‌లో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 3 రోజుల్లో వాతా�