Heavy rainfall: హిమాచల్‌ప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు.. 115 రోడ్లు మూసివేత
- హిమాచల్‌ప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు
- 115 రోడ్లు మూసివేత
- ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్‌ప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సిమ్లా వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు 115 రహదారులను అధికారులు మూసివేశారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి.
ఇది కూడా చదవండి: AAP-Cong: కాంగ్రెస్, ఆప్ పొత్తుకు బ్రేక్..అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
మండిలో 107, చంబాలో నాలుగు, సోలన్‌లో మూడు, కాంగ్రా జిల్లాలో ఒకటి సహా మొత్తం 115 రోడ్లు వర్షాల కారణంగా మూసివేశారు. వాహనాల రాకపోకలు జరగకుండా ముందస్తుగా నిలిపివేశారు. ఇక రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం ప్రకారం రాష్ట్రంలో 212 ట్రాన్స్‌ఫార్మర్‌లకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Harish Rao: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
ఇదిలా ఉంటే చండీగఢ్-మనాలి నాలుగు-లేన్ల రహదారిలో మండి నుంచి పండోహ్ మధ్య పగుళ్లు ఏర్పడ్డాయి. బుధవారం నుంచి వన్-వే ట్రాఫిక్‌ను మాత్రమే అనుమతించాలని అధికారులు తెలిపారు. లక్షలాది రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్‌ను నిర్మించినప్పటికీ రెండు అడుగుల మేర పడిపోయిందని, నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ప్రాజెక్ట్ మేనేజర్ రాజ్ శేఖర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Harish Rao: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
ఇక శని, ఆదివారాల్లో (జూలై 6 మరియు 7) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. బలమైన గాలులు, వర్షం కారణంగా తోటలు, ఉద్యానవనాలు, పంటలకు నష్టం కలిగే అవకాశాలున్నాయని తెలిపింది. కచ్చా ఇళ్లు, గుడిసెలకు స్వల్ప నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. రాష్ట్ర రాజధాని సిమ్లాలో బుధవారం సాయంత్రం నుంచి 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పలు చెట్లు నేలకూలాయి. ఇక చెత్తాచెదారం రోడ్లపై పడి ఉంది.
ఇది కూడా చదవండి: SSMB 29 : ఏంటి సార్ ఇదీ.. వంట పాత్రలకు 20 లక్షల ఖర్చా?
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!