ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి భారీ షాక్ తగిలింది. టాలీవుడ్ నటులు నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వైవాహిక జీవితం మీద కామెంట్స్ చేసిన కేసు విషయంలో మహిళా కమిషన్ ఆయనకు రెండోసారి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14వ తేదీన కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఈ కేసు విషయంలోనే నోటీసులు పంపగా.. వేణు స్వామి విచారణకు హాజరు కాలేదు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ.. వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో చాలా…