కోనసీమ జిల్లాకు డా.బీఆర్ అంబేద్కర్ పేరు పెడతామని ప్రభుత్వం ప్రకటించడంపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కోనసీమ దళితుల ఆకాంక్ష నెరవేరిందని ఆయన అభిప్రాయపడ్డారు. కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయం అని కొనియాడారు. దళితులు, మేధావులకు సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాలు, కోనసీమ దళిత ప్రజాప్రతినిధులు కోరిన విషయాన్ని మంత్రి గోపాలకృష్ణ…