CM Chandrababu: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 2 వరకు కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరుఫున సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి ఎవరికి దక్కని భాగ్యాన్ని తనకు కల్పించారని సీఎం చంద్రబాబు అన్నారు. 14 సార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం కల్పించారని తెలిపారు. 22 సంవత్సరాల క్రితం వేంకటేశ్వర స్వామి ప్రాణబిక్ష పెట్టారని.. వేంకటేశ్వర స్వామి వారి ప్రాభల్యాని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లారన్నారు.