తెలంగాణలోని వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. అత్యంత త్వరలోనే కొత్త వాహన తుక్కు పాలసీని తీసుకువస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. సారధి వాహన్ అనే పోర్టల్ లో 28 రాష్టాలు జాయిన్ అయ్యాయని, తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు జాయిన్ కాలేదన్నారు. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈరోజు నుంచి సారధి వాహన్ పోర్టల్ లో జాయిన్ అవుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్త వాహన స్క్రాప్…