Namitha: సొంతం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నమిత. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తరువాత వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించినా.. అమ్మడికి ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ బొద్దుగా మారి కోలీవుడ్ లో అడుగుపెట్టింది.