సంక్రాంతి పండగకి బాక్సాఫీస్ ని రాఫ్ఫాడించడానికి మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారం ఎత్తి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ రవితేజ క్యామియో రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ‘వాల్తేరు వీరయ్య’ కోసం రెండు అదిరిపోయే పాటలని ఇచ్చాడు. ఇన్స్టాంట్ హిట్స్…