మరో కీలక నేత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.. వైసీపీకి ఇవాళ రాజీనామా చేయనున్నారు వాసిరెడ్డి పద్మ.. గ న్నికల్లో జగ్గయ్యపేట సీటు ఆశించారు వాసిరెడ్డి పద్మ.. అయితే, ఇటీవల తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట ఇంఛార్జ్ గా నియమించింది వైసీపీ అధిష్టానం.. ఇక, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సీటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో వాసిరెడ్డి పద్మ ఈ నిర్ణయానికి వచ్చారనే చర్చ సాగుతోంది..