"ఇప్పటి వరకు అనకాపల్లి బెల్లం గురించే విన్నాం.. కానీ ఇప్పుడు అనకాపల్లి గుడ్డు గురించి వింటున్నా.. ఐదు శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం, ప్రభుత్వ విప్ ఇచ్చినా కిలోమీటర్ రోడ్డు కూడా వేయించుకోలేక పోయారు.." అంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి వారాహి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులో వారాహి వాహనానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. పిఠాపురంలో పవన్ వారాహి సభకు పోలీసులు అనుమతి నిరాకరించగా.. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శక్తి పీఠంలో వారాహికి పూజ వాయిదా పడింది.