తెలుగు చిత్రసీమలో తనదైన వాణి వినిపించి, తనకంటూ ఓ బాణీని ఏర్పరచుకున్న మధురగాయని వాణీ జయరామ్ కీర్తి కిరీటంలో పద్మభూషణ్ అవార్డు చోటు చేసుకోవడం సంగీత ప్రియులందరికీ ఆనందం పంచుతోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రప్రభుత్వం వాణీ జయరామ్ కు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ వార్త వినగానే దేశవిధేశాల్లోని వాణీ జయరామ్ అభిమానుల ఆనందం అంబరమంటింది. వాణీ జయరామ్ ప్రతిభకు కేంద్రం తగిన సమయంలో సరైన అవార్డును ప్రదానం చేస్తోందని పలువురు సంగీతాభిమానులు ప్రశంసిస్తున్నారు. తమిళనాట…