వంగవీటి కుటుంబం నుంచి మరో వారసత్వం పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతోందా? అందుకోసం గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ జరిగిపోతోందా? కొత్తగా రాజకీయ ప్రవేశం చేయబోతున్న ఆ వారసులు ఎవరు? ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? అసలు ప్లానింగ్ ఏంటి? ఆశాకిరణ్…. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద తళుక్కుమంటున్న సరికొత్త కిరణం. రాజకీయాల దిశగా దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె వేస్తున్న అడుగులు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి అభిమానులు ఉన్నారు. రంగా…