కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అయింది. కరోనా తగ్గిందనుకునేలోపే ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. మేడారంకి ముందస్తు మొక్కుల కోసం వస్తున్న వాళ్ళను కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. టీకా వేసుకున్న వారికే వనదేవతల దర్శనానికి అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేళ్లకు ఒక్కసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతరకు అప్పుడే జనం తాకిడి పెరిగింది. కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అని జరుగుతున్న ప్రచారం నేపథ్యం…