Uttarkashi Tunnel : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే వివిధ ఏజెన్సీల పని బుధవారం చివరి దశకు చేరుకుంది.
Uttarkashi Tunnel: ఉత్తరకాశీలోని సొరంగంలో 41 మంది చిక్కుకుపోయి 8 రోజులైంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం సొరంగం పరిశీలన అనంతరం మాట్లాడుతూ, ఈ మొత్తం ఆపరేషన్ ముగియడానికి మరో రెండు నుండి రెండున్నర రోజులు పట్టవచ్చని తెలిపారు.
Uttarakhand: ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకున్న ప్రజల జీవన్మరణ పోరాటం కొనసాగుతుంది. ఆదివారం ఉదయం నుంచి సొరంగంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి విజయం సాధించలేదు.
Uttarkashi Tunnel : ఉత్తరకాశీలో దీపావళి రోజున యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి NDRF బృందం రెండవ రోజు చేరుకుంది. సొరంగంలో చిక్కుకున్న వారంతా క్షేమంగా ఉండడం ఉపశమనం కలిగించే అంశం. వారికి ఆహార పానీయాలు పంపిణీ చేశారు.