గురువులు దండించేది విద్యార్థులు సన్మార్గంలో నడవాలని, భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని. కానీ నేటి రోజుల్లో విద్యార్థులు టీచర్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఏకంగా గన్ తీసుకొచ్చి మరీ కాలుస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి క్లాస్ రూమ్ లో తనను చెంపదెబ్బ కొట్టాడని గన్ తీసుకొచ్చి టీచర్ పై కాల్పులు జరిపాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ పాఠశాలలో గంగాన్‌దీప్ సింగ్ కోహ్లీ అనే ఉపాధ్యాయుడు భౌతికశాస్త్రం బోధిస్తున్నాడు.…