తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగనున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ క్రమంలో.. నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ సీఈవో శివ శంకర్ లోతేటి చర్చలు జరిపారు. పేషెంట్లకు ఇబ్బంది కలిగించకుండా వైద్య సేవలు అందించాలని సీఈవో విజ్ఞప్తి చేశారు.