Trump: నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశే ఎదురైంది. వెనిజులా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడోను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అయితే, ట్రంప్‌కు నోబెల్ బహుమతి రాకపోవడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం స్పందించారు. ట్రంప్ శాంతి కోసం ఎంతో ప్రయత్నం చేశారని, ఉదాహరణగా ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ప్రణాళిక’’ను చూపారు.
Putin Warning US: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది కానీ, ముగింపు దిశగా అడుగులు మాత్రం పడటం లేదు. తాజా ఈ యుద్ధంలోకి అమెరికా సూపర్ వెపన్ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వెపన్‌పై, అమెరికా తీరుపై రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఆయన అగ్రరాజ్యానికి ఏమని వార్నింగ్ ఇచ్చారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుంది..…
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం 2022 లో ప్రారంభమైంది. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు ప్రయత్నాలు చేశాయి. అయితే, ఎవరూ విజయవంతం కాలేదు. కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఇంతలో, రేపు, అంటే ఆగస్టు 15 న, అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగే సమావేశం ఈ యుద్ధం పరంగా కీలకంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగించాలో ఇద్దరు నాయకులు…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధంపై శుక్రవారం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పుతిన్‌తో తాను చాలా అసంతృప్తితో ఉన్నారనని, ఆయన ప్రజలను చంపాలనుకుంటూనే ఉన్నారని ట్రంప్ అన్నారు. ఇది చాలా కఠినమైన పరిస్థితి అని, పుతిన్ ఫోన్ కాల్ పట్ల నేను చాలా అసంతృప్తితో ఉన్నానని, ఆయన ప్రజల్ని చంపుతూనే వెళ్లాలని అనుకుంటున్నారని ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో అన్నారు.
USA: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్, రష్యాల మధ్య స్నేహం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పలుమార్లు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీతో ట్రంప్‌కి పొసగడం లేదు. ఉక్రెయిన్ యుద్ధానికి పుతిన్, ట్రంప్ మార్గాలను వెతుకుతున్నారు.
Donald Trump: అమెరికా, ఉక్రెయిన్‌లోని ‘‘అరుదైన లోహాల’’పై కన్నేసింది. ఉక్రెయిన్ సహజ వనరుల నుంచి వచ్చే ఆదాయంలో అమెరికాకు వాటా మంజూరు చేసే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్ స్కీ ఈ ప్రతిపాదనపై సంతకం చేయడానికి ఈ వారం లేదా వచ్చే వారు వైట్ హౌజ్‌కి రావచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇది ఇద్దరు నాయకుల మధ్య పెరుగుతున్న విభేదాలకు కేంద్రంగా మారింది. సోమవారం వైట్‌హౌజ్‌లో…