అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు బరిలోకి దిగిన జోబైడెన్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రెసిడెంట్‌గా పూర్తి కాలం కొనసాగుతానని ఆయన తెలిపారు. అధ్యక్ష పోటీకి కమలాహారిస్‌ను బైడెన్ ప్రతిపాదించారు.
US presidential race: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 2024లో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి, ఈ నేపథ్యంలో అక్కడి ప్రెసిడెంట్ రేసు మొదలైంది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల్లో అధ్యక్ష బరిలో నిలిచేందుకు పలువురు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీలో ఈ పోటీ ఎక్కువగా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇండో అమెరికన్లు వివేక్ రామస్వామి, నిక్కీ హెలీ లాంటి వారు పోటీలో ఉన్నారు.
ఫ్లోరిడా గవర్నర్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష రేసుపై ఆసక్తి కనబరిచాడు. ఆ క్షణం నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నానని ఆయన వెల్లడించారు. అయితే అందుకు ఆయన సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నాడు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ అమెరికా అధ్యక్ష రేసులో ప్రచారం స్టార్ట్ చేశాడు.